![]() |
![]() |

బ్రహ్మముడి సీరియల్ రాజ్ అలియాస్ మానస్ నాగులపల్లి సెప్టెంబర్ 10 న ఒక మగబిడ్డకు తండ్రైన విషయం తెలిసిందే. రీసెంట్ గా తమ కుమారుడి నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు మానస్ అండ్ శ్రీజ. ధ్రువ నాగుల పల్లి అనే పేరు పెట్టి ఆ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు మానస్. అలాగే నామకరణ మహోత్సవం ఫొటోస్ ని కూడా ఫాన్స్ కోసం పోస్ట్ చేసాడు. దీంతో వెండితెర, బుల్లితెర పాపులర్ పర్సన్స్, ఫాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ మెసేజెస్ పెడుతున్నారు. ఇక మానస్ ఐతే బిడ్డను చూసుకుంటూ తెగ బ్లష్ ఐపోతూ కనిపించాడు. లాస్ట్ ఇయర్ నవంబర్ లో మానస్, శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. ఇక మానస్ చైల్డ్ ఆర్టిస్టుగా స్క్రీన్ మీద అడుగుపెట్టాడు.
ఇప్పుడు బ్రహ్మముడి రాజ్ గా సీరియల్ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. కార్తీక దీపం సీరియల్ కి ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలిసిన విషయమే.. ఆ సీరియల్ ఐపోయాక ఆ టైం స్లాట్ లో వస్తున్న ఈ బ్రహ్మముడి సీరియల్ కూడా అంతే టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇక మానస్ ‘కోయిలమ్మ’, ‘మనసిచ్చి చూడు’ వంటి సీరియల్స్‌తో బెస్ట్ పెర్ఫార్మర్ గా మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. అదే స్పీడ్ తో తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లోకి వెళ్లి గ్రాండ్ ఫినాలే వరకు వచ్చాడు. అలాగే కొన్ని మూవీస్ లో కూడా నటించాడు.
![]() |
![]() |